Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 4:28 pm Posted by : ramakrishna

గద్దర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వాక్యాలను ఉపసరించుకోవాలి

ఆర్మూర్, బతుకమ్మ : ప్రజా గాయకుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఉచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలానీ నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరీ వినోద్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 19 69 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తన గళాన్ని వినూత్న శైలిలో గట్టిగా వినిపించిన కళాకారుడని అన్నారు. తెలంగాణ ప్రజా కవి గద్దర్ అని తెలంగాణ ప్రజలు నైతిక విలువలను కాపాడుకుంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాడని తెలిపారు. గద్దర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు ఎంత మాత్రం తగదని అన్నారు. తక్షణమే తెలంగాణ ప్రజాకవి గద్దర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని గద్దర్ కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల అని నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరీ వినోద్ డిమాండ్ చేశారు. లేనియెడల బండి సంజయ్ ఇంటి నీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మున్నూరు ప్రణయ్ పాల్గొన్నారు.