Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:05 pm Posted by : ramakrishna

బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి

 

. . . బండి భగీరథ వెంటనే అరెస్టు చేయాలి

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. భిక్కనూర్ చౌరస్తాలో మంగళవారం బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే బండి భగీరథ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాజబాబు గౌడ్, బల్యాల సుదర్శన్, తాటిపాముల లింబాద్రి, మహిపాల్, సురేష్, అశోక్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.