Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2024, 4:24 pm Posted by : ramakrishna

కవిత బెయిల్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

బతుకమ్మ, నిజామాబాద్ : బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మద్యం కుంభకోణం లో అరెస్టయిన కవితకు బెయిల్ ఇప్పించడం లో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ, వారి లాయర్లకు కంగ్రాట్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఇది బీ  ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ సమిష్టి విజయమని అన్నారు. బీ ఆర్ ఎస్ నేత ఒకరు బెయిల్ పై బయటకు వస్తె.. కాంగ్రెస్ నాయకుడు ఒకరు రాజ్యసభకు వెళ్తున్నారని, ఇది కేసీఆర్ రాజకీయ చతురతకు నిదర్శనమని అన్నారు. ఈక్విడ్ ప్రో కో నేరం లో పాలు పంచుకున్న భాగస్వాములకు అభినందనలు అంటూ మండిపడ్డారు. విలీనం మాటా ముచ్చట పూర్తైంది.. ఇక అప్పగింత లే తరువాయి అంటూ హాట్ కామెంట్స్ చేశారు.