నర్మాలలో బండి సంజయ్, కేటీఆర్ ముఖాముఖి
బిజెపి, బిఆర్ఎస్ నాయకులకు ఆసక్తికర సన్నివేశం రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వరద బాధితులను పరామర్శించే క్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. బాధితులను పరామర్శించిన అనంతరం బయలుదేరుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వాహనం దిగిన బండి సంజయ్ కేటీఆర్ కు అభివాదం చేశారు."బాగున్నారా?" అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "కష్టపడుతున్నావ్" అంటూ కేటీఆర్ స్పందించగా, ఆ తరువాత బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు.