. . . పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని, బండి భగీరథ్ ద్వారా లైంగికంగా వేధింపులకు గురైన మహిళా వారం రోజుల క్రితం న్యాయం చేయాలని హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పోలీసులు పట్టించుకోవటం లేదని పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళాకు న్యాయం జరగకుండా అధికార ప్రోత్బలంతో మ్యానేజ్ చేసేందుకు కృషి చేస్తున్న బండి సంజయ్ తన కొడుకు వైఖరి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. పోలీస్ లు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నత్తనడక చేపడుతున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. చట్టాలు పేద ప్రజలపై ప్రయోగిస్తారు తప్ప ఉన్నోళ్లకి వర్తించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సిట్ విచారణకి హాజరుకావాలని కోరినా చట్టాన్ని గౌరవించకుండా తలదాచుకున్న బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని పిడిఎస్ యు విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శించకుండా నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరిపేందుకు పోలీస్ లకు అధికారాలు ఇవ్వాలని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకోవడానికి కేంద్ర సహాయశాఖ మంత్రి బండి సంజయ్ సహకరించాలని కోరారు. లేని పక్షంలో బాధిత మహిళకు అండగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్. అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు వైష్ణవి, నసీర్, నితిన్, జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు దీపిక, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.