Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 4:46 pm Posted by : ramakrishna

బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి

 

. . . కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం  జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో మూడు రోజుల నుంచి బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. ఆయన తప్పించుకోవటానికి ఆయన తండ్రి అయిన మంత్రి బండి సంజయ్ రాజ్యాంగ పరిరక్షణ చేస్తానని ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ భగీరథ్ ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుందని మండి పడ్డారు. ఫోక్సో కేసు నమోదు అయితే సాధారణ ప్రజలను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతారని, కానీ అధికార పార్టీ కేంద్రమంత్రి నాయకుడు కుమారుడికి మాత్రం ఆ చట్టం వర్తించకపోవడం అన్యాయమని అన్నారు. దీని వల్ల చట్టం, న్యాయం అనేది అధికారంలో ఉన్నవారికి ఒక విధంగా, లేని వారికి మరొక విధంగా వర్తింప చేయటం పోలీసుల దొంగ నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ కుమారుని అరెస్టు చేయాలని, లేని యెడల కేంద్ర రాష్ట్ర విధానాలపై ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు మాట్లాడుతూ గతంలో బిజెపి నాయకులు మహిళలపై, బాలికలపై దాడులు చేసి, హత్యలు చేసిన సంఘటన కానీ ఇతర హత్యలు కానీ నీరుగార్చటానికి ఏ విధంగా ప్రయత్నించారో, నేటి పాలకులు అదే విధానాన్ని అనుసరించాలని పోలీస్ యంత్రాంగం పైన ప్రభుత్వ ప్రతినిధుల పైన ఒత్తిడి చేసే అవకాశం ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ నాయకులు నల్వాల నరసయ్య, అనసూయమ్మ, అనిత, అంజయ్య, ఉద్ధవ్, శంషుద్దీన్, రాజు, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

 

Bandi Bhagirath should be arrested.