Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 5:34 pm Posted by : ramakrishna

బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

 

. . . బండి సంజయ్ మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలి

 

. . . ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

బండి సంజయ్ ని బర్తరాఫ్ చేస్తూ కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో సోమవారం ప్రెస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికారం ఉందని ఈ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అరాచకం చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 3 రోజులు కావస్తున్నా అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత విచారణ పేరుతొ కాలయాపన చేస్తున్న చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి నామీద అఘాయిత్యం జరిగిందని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్తే తమ విజ్ఞప్తిని పట్టించుకోక వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టం సామాన్యులకు ఒకలా, రాజకీయ నాయకులకు ఒకలా ఉంటుందా అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోని బాధితురాలికి రక్షణ కల్పించి న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.