Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2024, 5:53 pm Posted by : ramakrishna

బిచ్కుందలో బంద్ ప్రశాంతం

బతుకమ్మ: బిచ్కుంద : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నరమేధాన్ని నిరసిస్తూ సోమవారం బిచ్కుంద పట్టణంలో స్వచ్చంద బంద్‌ పాటించారు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బందును నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. నరమేధాన్ని ఖండిస్తూ బంద్‌, నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయం 9గంటల నుంచి బిచ్కుంద పట్ణణంలోని ప్రధాన వీధుల గుండా భారీగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బందును పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని రకాల హిందూ సంఘాలు ఐక్యవేదికగా బందున ప్రశాంతంగా నిర్వహించారు.

Bandh calm in Bichkunda