నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు గ్రామంలో సోమవారం బండ పోచమ్మ బోనాలు, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోతు రాజుల విన్యాసం, శివ శక్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు కడేలతో ఊరేగింపుగా పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఉదయం పండితుల వేద మంత్రాల మధ్య విగ్రహాల ప్రతిష్ఠాపన, హోమం నిర్వహించారు. గ్రామ ప్రజలు బండ పోచమ్మకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ఫెండ్ర్స్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
