ప్లాస్టిక్ ను నిషేధించి ప్రకృతిని కాపాడాలి

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు   నిజామాబాద్, బతుకమ్మ :  ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి ప్రకృతిని కాపాడాలని మున్సిపాల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు అన్నారు. శనివారం నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్  హృదయ పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల  జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఓ వ్యక్తి ప్లాస్టిక్ కవర్లను తన చుట్టు కట్టుకుని ప్లాస్టిక్ వినియోగిస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యభారిన పడుతారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో...