Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 6:17 pm Posted by : ramakrishna

ప్లాస్టిక్ ను నిషేధించి ప్రకృతిని కాపాడాలి

  • విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు

 

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి ప్రకృతిని కాపాడాలని మున్సిపాల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు అన్నారు. శనివారం నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్  హృదయ పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల  జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఓ వ్యక్తి ప్లాస్టిక్ కవర్లను తన చుట్టు కట్టుకుని ప్లాస్టిక్ వినియోగిస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యభారిన పడుతారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, పాఠశాల హెడ్ మిస్టర్ సవితతో కలిసి విద్యార్థులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలో ఎక్కపడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలన్నారు. వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ప్రధానంగా ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లో మాత్రమే వేయాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలన్నారు. తినుభండారాలను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచద్దన్నారు. విద్యార్థులు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను అవగాహన కల్పించుకుని ఇతరులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.