Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 6:34 pm Posted by : ramakrishna

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

  • భారతీయ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీర్

 

ఆర్మూర్, బతుకమ్మ: బామ్ సేఫ్ రాష్ట్ర 12వ మహాసభలను విజయవంతం చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న కోరారు. సోమవారం ఆర్మూర్ పట్టణ  కేంద్రంలోని అంబేడ్కర్ ఆఫీస్ లో స్థానికులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బామ్ సేఫ్ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.