Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:56 pm Posted by : ramakrishna

ఖో ఖో  పోటీలలో నియోజకవర్గ మొదటి స్థానంలో నిలిచిన బాల్కొండ బాలికల జట్టు

 

బాల్కొండ, బతుకమ్మ :

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం, శనివారం బాల్కొండ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు మోతె లో జరిగాయి. ఇందులో బాల్కొండ బాలికల జట్టు ఖో ఖో లో మొదటి స్థానాన్ని,  కబడ్డీ రెండో స్థానాన్ని వాలీబాల్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ అత్యంత ప్రతిభా కనబరిచిన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు పిడి రాజ్ కుమార్ ను అభినందించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను, ఎంపికైన క్రీడాకారులను ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంఈఓ బట్టు రాజేశ్వర్ లు  అభినందించారు , పిడి రాజ్ కుమార్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా స్థాయి పోటీల్లో కూడా బాల్కొండ విద్యార్థినిలు రాణించి మండలానికి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలన్నారు.