Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 7:42 pm Posted by : ramakrishna

దివంగత సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జి

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ముత్యాల సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సర్పంచ్ పావని నివాసానికి వెళ్లి ఆమె భర్త భాను, తల్లి, కుమారులు భవిత్, భవిన్‌లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భగవంతుడు పావని కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన పావని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి సునీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. పావని భర్త భానును పరామర్శించి కుటుంబానికి తన సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాళ్ల రాంపూర్ గ్రామానికి సర్పంచ్ పావని మృతి తీరని లోటని అన్నారు. కొద్దికాలంలోనే ఆమె గ్రామ అభివృద్ధికి చురుకైన ప్రజా నాయకురాలిగా పనిచేశారని, ప్రజలతో ఎంతో సౌమ్యంగా, ప్రేమగా మెలిగేవారని పేర్కొన్నారు. పెద్దల పట్ల గౌరవం, మర్యాద కలిగిన వ్యక్తిగా ఆమె అందరి మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, సోమ దేవరెడ్డి, తడపాకల్ జింక అనిల్, బద్దం లింగారెడ్డి, ముస్క మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.