Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 6:57 pm Posted by : ramakrishna

వస్త్ర షాపింగ్ మాల్ కు బల్ధియా నోటీసులు

. . . నిబంధనలు ఉల్లంఘించారని తాఖీదులు

. . . షాపింగ్ మాల్ ప్రారంభంకు గంటల ముందు నోటిస్ ల పై చర్చ

. . . టౌన్ ప్లానింగ్ అధికారులపై  కార్పొరేటర్ల దౌర్జన్యం

. . . ప్రారంభ సమయంలో నోటిస్ లు ఎందుకు?

 బతుకమ్మ నిజామాబాద్ సిటీ..

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ పి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వస్త్ర షాపింగ్ మాల్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నోటిస్ లు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ అధ్వర్యంలో సిబ్బంది మంగళవారం ఉదయం షాపింగ్ మాల్ నిర్మాణం కొసం చేసిన దరఖాస్తులు వేరు నిర్మాణం జరుగుతున్నది వేరుగా ఉందని ఈ మేరకు నోటిస్ లుమ ఇచ్చినట్లు తెలిసింది. ఐతే మంగళవారం జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభంగా కాబోతున్న  ప్రముఖ వస్త్ర షాపింగ్ మాల్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం వెల్లగా కోందరు కార్పోరేటర్లు వారిని అడ్డుకోన్నారు. వారిని లోనికి అనుమతించలేదు. దానితో ఈవిషయంను ఉన్నతాధికారులకు సమాచారం అందించిన వారు నోటిస్ లు ఇచ్చి వెనుదిరిగారు. వస్ర్త షాపింగ్ మాల్ నిర్మాణం గత ఎడాధికాలంగా జరుగుతుంటే ఎందుకు బల్ధియా అదికారులు అప్పుడు నోటిస్ లు ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతుంది . షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి చేసుకోని మరి కోన్ని గంటలలో ప్రారంభోత్సవంకు పనులు జరుగుతుంటే టిఎస్ బిపాస్ అధికారులు ఎందుకు అడ్డుకోలేదని చర్చ మొదలైంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తులో ఇచ్చిన ప్లాన్ కు విరుద్ధంగా సెట్ బ్యాక్ లేకుండా ఐదంతస్థుల నిర్మాణం, పైర్ సెప్టి మేజర్ మెంట్ లను ఉల్లంఘించడం పట్ల  అధికారులు నిర్లక్ష వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. షాపింగ్ మాల్ గతంలో అధికార పార్టికి చెందిన ఒ కార్పోరేషన్ చైర్మెన్ కు సంబందించినది అని తెలిసింది.

 

Baldhia Notices to Vastra Shopping Mall