రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బాలా పూర్ గణేశ్ లడ్డూ ప్రత్యేకత తెలిసిందే. ఈసారి శనివారం జరిగిన లడ్డూ వేలంపాటలో 38మంది పాల్గొన్నారు. రూ. 35లక్షలకు లడ్డూను కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. గతేడాది ఈలడ్డూ రూ. 30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నాడు. గతేడాది కంటే ఈసారి లడ్డూ ధర రూ.4.99 లక్షలు అధికంగా పలికింది. విజేత దశరథ్ గౌడ్ ను ఉత్సవ కమిటీ సన్మానించింది.