Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 6:56 pm Posted by : ramakrishna

బాచన్ పల్లి విద్యార్థులకు బాలరత్న అవార్డులు

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాచన్ పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన విద్యార్థులకు బాలరత్న అవార్డులు వచ్చాయి. కమలాకర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవంన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన బాలలను వారి ప్రతిభను చూసి బాలరత్న అవార్డ్స్ ను అందజేశారు. ఈ అవార్డు ల కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా భీమగల్ మండలం జెడ్పిహెచ్ఎస్ బాచన్ పల్లి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న  రావుట్ల లిఖిత్, శృతిక, రశ్మితలకు  సాహిత్య రంగంలో వారి నైపుణ్యాలను గుర్తించి బాలరత్న  అవార్డు లు అందజేశారు. హైదరాబాద్ లోని కోటి సుల్తాన్ బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ భాష నిలయము లో ఈ నెల 18న   ముగ్గురు చిన్నారులకు ఈ బాలతరత్న అవార్డులను నిర్వాహకులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు,  బాల గంగాధర్, ఉపాధ్యాయులు అవార్డు లు అందుకున్న స్టూడెంట్ లకు అభినందించారు.