న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని తిలక్ గార్డెన్ లో గల బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి న్యాయవాదులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాద జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బాలగంగాధర్ తిలక్ స్వయం పాలన కోసం భారత స్వతంత్ర ఉద్యమంలో దేశభక్తి జాతీయ బావని పెంపొందించడం కోసం కృషి చేశారని అన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన పత్రికల...