ఇందల్వాయిలో ఘనంగా బక్రీద్ పండుగ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బక్రీద్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి, గన్నారం, తీర్మాన్ పల్లి, నల్లవెల్లి, హంసన్పల్లి తదితర గ్రామాలలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శాంతియుత వాతావరణం లో జరుపుకున్నారు. ఉదయం ఈద్గాలకు వెళ్లి ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.