భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈద్గాహ్‌లకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ప్రార్థనల అనంతరం సంప్రదాయం ప్రకారం మేకలు, గొర్రెలను ఖుర్బానీ చేసి వాటి మాంసాన్ని బీదలకు, బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో సందడి చేయగా గ్రామాల్లో...