. . . బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
గతకొంతకాలంగా కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారని, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఇంతకాలం మాట్లాడలేదని బాజిరెడ్డి గోవర్ధన్ , ఏనుగు రవీందర్ రెడ్డి మీ గత చరిత్రలు మరిచిపోయి మాట్లాడొద్దు… ప్రజలకు అన్నీ తెలుసని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్నను అదే గ్రామానికి చెందిన బక్క నారాయణ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెల్సిందే. ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎర్రపాడు గ్రామంలో దళితుల భూములు లాక్కొని సుమారు 300 ఎకరాలు సంపాదించుకున్నారనేది నిజం కాదా? అని అన్నారు. బాజిరెడ్డి బాన్సువాడ ప్రజలు గతాన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. 2004లో మీరు బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దికాలానికే మా మేనమామను హత్య చేయించిన విషయం నియోజవర్గ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. ఆ తర్వాత 2009లో బాన్సువాడ ప్రజలే మీకు తమ తీర్పును ఇచ్చారు. మరి ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని బాన్సువాడ నియోజకవర్గంలోకి వస్తున్నారు? నిజామాబాద్ రూరల్‌లో మీ రాజకీయ భవిష్యత్తుపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని భావించి, ఇక్కడికి రావాలని మీ అధిష్ఠానం నిర్ణయించిందా? అని ప్రశ్నించారు. అలా వచ్చినా… బాన్సువాడ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని అనుకుంటున్నారా? అన్నారు. బాన్సువాడ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారని, ప్రజలకు అన్నీ తెలుసునని అన్నారు.