Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 7:35 pm Posted by : ramakrishna

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బైరి రవి

  • హక్కుల సాధనకై ముందుంటా : బైరి రవి

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శుక్రవారం  మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లుతెలిపారు.నూతన గ్రామా శాఖ అధ్యక్షులుగా బైరి రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.ప్రధాన కార్యదర్శి గొంగ గంగాధర్,ఉపాధ్యక్షులు ఉప్పల్వాయి శంకర్,గురిజాల నవీన్,కార్యదర్శిగా ఉప్పల్వాయి రఘుపతి,కోశాధికారి బిక్కయి సాయిలు,ను ఎన్నుకున్నారు. అనంతరం గ్రామా శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన బైరి రవి మాట్లాడుతూ మున్నూరు కాపుల హక్కుల కొరకు సమస్యలు తీర్చడంలో ముందుంటానని అన్నారు,దీనికి సంఘసభ్యులందరు సహకరించాలని కోరారు,భవిష్యత్తులో మున్నూరు కాపు సంఘం హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి,మండల స్థాయిలలో  ఎప్పుడు పిలుపిచ్చిన అందరు సహకరించాలని కోరారు.స్థానిక సంస్థలు ఉన్నందున అందరు ఐక్యంగాఉండాలన్నారు.అనంతరం తనపట్ల ఏంతో నమ్మకంగా గ్రామా శాఖ అధ్యక్షునిగాఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు.