తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  చార్‌ధామ్‌ యాత్రలో కీలకమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు ధామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి బద్రినాథ్‌ చేరుకొని స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. జై బద్రీ విశాల్‌...