బడా రామ్ మందిర్ సంఘటన స్థలాన్నిపరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాజుల్ పేట్ బడా రామ్ మందిర్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. ఇందూర్ నగరంలో అతిపురాతనమైన దేవాలయం బడా రామ్ మందిర్ లో గోశాల పక్కన ఉన్న గడ్డివాముకు అగ్ని ప్రమాదం జరగటం దురదృష్టకరం అన్నారు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న గోవులకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. సంఘటన విషయమై దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సంఘటనకు గల కారణాలు అడిగితెలుసుకున్నారు. ఇప్పటివరకు...