గణేష్ నవరాత్రులపై దుష్ప్రచారం  :  బండి సంజయ్

కరీంనగర్, బతుకమ్మ :  గణేష్ నవరాత్రులపై  కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.  రాజకీయాలకు అతీతంగా వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఘనంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  గతంలో కంటే ఈసారి యువతలో భక్తి భావం పెరిగిందన్నారు.  కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.