నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గోసంగిలపై చేస్తున్న దుష్ప్రచారాలను మానుకోవాలని జిల్లా గోసంగి కులస్తులు డిమాండ్ చేశారు. బుదవారం జిల్లా గోసంగి కులస్తుల ఆద్వర్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గోసంగి కులస్తుల పై కొందరు గోషికేలు చేస్తున్నా అరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజమైన గోసంగిలు ఎవరనేది ప్రభుత్యం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.కానీ గోషికేలు చేస్తున్న ఆరోపణలను అదునుగా తీసుకొని కొందరు వారి రాజకీయ లబ్ధి కోసం నిజమైన గోసంగిలమైన మమ్మల్ని బెడ బుడగ జంగాలు గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ విషయం పై గతంలో కొందరు గోసంగి కులస్తులు ప్రభుత్యం దృష్టికి తీసుకువచ్చారనీ తెలిపారు.డి.ఎల్.యస్.సి కమిటీకి మేము కట్టుబడి ఉన్నామనీ వారు తెలిపారు. ఇక మీదట గోసికె వారు మాపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా వారికి మీ ద్వారా ఆదేశాలు జారీచేయవలసినదిగా విన్నవిస్తున్నామనీ పేర్కొన్నారు. ఇక మీదట మా ఆత్మస్థైర్యాన్ని సమాజంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాకుండా ఇరువర్గాలు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోసంగి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.