రూ. రెండున్నర లక్షలకు పసికందు విక్రయం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కన్నతల్లి మరో ముగ్గురితో కలిసి తన రెండు నెలల కొడుకును విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని తల్లి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. పోలీసులు పసికందును విక్రయించిన తల్లితోపాటు కొనుగోలు చేసిన వ్యక్తిని, ఇద్దరు దళారులను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపుతుంది. నగరంలోని ఎల్లమ్మ కుంటకు చెందిన బూరాల శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు....