ప్రభుత్వ శిశుగృహంలో పసికందు మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ,శిశు సంక్షేమ శాఖ పరిధిలోని శిశుగృహం (బాల్ రక్షక్) భవన్ లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని సుభాష్ నగర్ లో గల శిశుగృహ (బాల్ రక్షక్) భవన్ లో సుమారు 24 మంది ఆరేళ్ల లోపు ఆనాథ చిన్నారులకు ఆశ్రయంగా ఉంది. అందులో 3 నెలల వయస్సు కలిగిన స్వతంత్ర అనే పసికందు కు తీవ్ర ఆనారోగ్యం ఉండగా మంగళవారం ఉదయం మేనేజర్, ఎఏన్ఎం జిల్లా...