Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 6:29 pm Posted by : ramakrishna

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత మాజీ ప్రధానిగా, స్వాతంత్ర సమరయోధుడుగా చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అలంపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, ఏముల గజేందర్, బీజేవైఎం అధ్యక్షులు కుమార్ గణేష్, బిజెపి సీనియర్ నాయకులు కటికే రామ్ రాజ్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.