ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని ఫులాంగ్ లో గల బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతు వంద సంవత్సరాల క్రిందటే ఒక అద్భుతమైన దూరదృష్టితో సమ సమాజాన్ని...