Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:36 pm Posted by : ramakrishna

ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని ఫులాంగ్ లో గల బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతు వంద సంవత్సరాల క్రిందటే ఒక అద్భుతమైన దూరదృష్టితో సమ సమాజాన్ని నిర్మించిన గొప్ప దార్శనికుడు బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారి ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలు, దళితులు, సమాజానికి దూరంగా ఉన్న ప్రతి జాతికి  మేలు కలిగిందని ఈ సందర్భంలో గుర్తు చేశారు. అంబేద్కర్ ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని… మొత్తం భారతదేశానికి చెందిన వ్యక్తి అని, ఆయన ఒక అద్భుత శక్తి అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం ఒక గొప్ప కార్యంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరిపే రవిందర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సాయిలు, బాలన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.