కామారెడ్డి టౌన్ ఎస్ఎచ్ఓగా బి.నరహరి

మల్టీ జోన్​–1 పరిధిలో పలువురు సీఐల బదిలీ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి టౌన్​ ఎస్​హెచ్​వోగా బి.నరహరి నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్​రెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. మల్టీ జోన్​ –1పరిధిలో ఏడుగురు ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్​–1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజి కార్యాలయంలో వెయిటింగ్​లో ఉన్న ప్రభాకర్​ను నార్నూల్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న రహీమ్​ పాషాను రామగుండం కమిషనరేట్​ వీఆర్​కు అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న మాధవి...