టీయూలోని తెలుగు అధ్యయన శాఖలో బి. లింగరాజుకు డాక్టరేట్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో బి. లింగరాజుకు శనివారం పిహెచ్.డి. డాక్టరేట్ అందజేశారు. ఆచార్య వి.త్రివేణి పర్యవేక్షణలో బి. లింగరాజు "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం - సాహిత్య సేవ" అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. అందుకు గాను శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కాన్ఫరెన్స్ సెమినార్ హాలులో ఈ సిద్ధాంత గ్రంథంపై (వైవా వోస్) మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా...