Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 5:11 pm Posted by : ramakrishna

టీయూలోని తెలుగు అధ్యయన శాఖలో బి. లింగరాజుకు డాక్టరేట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో బి. లింగరాజుకు శనివారం పిహెచ్.డి. డాక్టరేట్ అందజేశారు. ఆచార్య వి.త్రివేణి పర్యవేక్షణలో బి. లింగరాజు “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం – సాహిత్య సేవ” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. అందుకు గాను శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కాన్ఫరెన్స్ సెమినార్ హాలులో ఈ సిద్ధాంత గ్రంథంపై (వైవా వోస్) మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ విచ్చేసి, సిద్ధాంత గ్రంథాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆ సమాధానాలకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పిహెచ్.డి.(వైవావోస్) మౌఖిక పరీక్షను కళల పీఠాధిపతి ఆచార్య కరిమిండ్ల లావణ్య, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పి కనకయ్య, పాఠ్యప్రణాళిక సంఘ చైర్మన్ డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ కె. సంపత్ కుమార్, ప్రిన్సిపల్ జి. రాంబాబు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ కె. రవీందర్ రెడ్డి తదితర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.