అజమాబాద్ – గండివేట్ బీటీ రోడ్ పనులు ప్రారంభం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అజమాబాద్ – గండివేట్ - వెల్లుట్లా బిటి రోడ్ రూ.1.49 కోట్లు వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రారంభం కావడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగించింది. ఈ రహదారి నిర్మాణం కోసం మాజీ ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు రాకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొని ఉంది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్థులకు,...