Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 6:01 pm Posted by : ramakrishna

అజమాబాద్ – గండివేట్ బీటీ రోడ్ పనులు ప్రారంభం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అజమాబాద్ – గండివేట్ – వెల్లుట్లా బిటి రోడ్ రూ.1.49 కోట్లు వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రారంభం కావడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగించింది. ఈ రహదారి నిర్మాణం కోసం మాజీ ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు రాకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొని ఉంది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్థులకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు నిరంతర ప్రయత్నాలు చేసి, రహదారి పనులు ప్రారంభమయ్యేలా చేశారు. గ్రామ ప్రజల కలను నిజం చేసిన నాయకుడిగా మదన్ మోహన్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో అటవీ శాఖ నుంచి అనుమతులు లభించడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అడవి ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అనుమతులు పొందడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, ప్రజల ప్రయోజనాన్ని ప్రధానంగా పరిగణించిన ఎమ్మెల్యే విజ్ఞత్వంతో పనులు మళ్లీ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నాళ్లుగా ఎదురు చూసిన సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

Azamabad-Gandivet BT Road work begins

Azamabad-Gandivet BT Road work begins