Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 3:48 pm Posted by : ramakrishna

అంగరంగ వైభవగా అయ్యప్ప మహా పడిపూజ

  •  పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
  •  భజన, అభిషేకాలు భక్తులను ఆకట్టుకున్నాయి

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి 38వ పడిపూజ ఎంతో రంగా రంగా వైభవంగా కనులకు పండగగా కార్యక్రమం పడిపూజ కార్యక్రమం జరిగింది. మొదటగా బాన్సువాడ పెద్ద హనుమాన్ మందిర్ నుండి నగల ఊరేగింపు అయ్యప్ప స్వాముల శరణు ఘోష మధ్య అయ్యప్ప పడిపూజ వద్దకు తీసుకువచ్చారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ అయ్యప్ప మహా పడిపూజకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు మధ్యన స్వామివారికి ఇష్టమైన అభిషేకాలు జరిగాయి. మహా పడిపూజలో పిట్ల కృష్ణ మహారాజ్ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది.రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపీ బీ బీ పటేల్   మాజీ ఎంపీ. మాజీ శాసనసభ్యులు లక్ష్మీనారాయణ ,సరస్వతి మాత ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి  జూకల్ మాజీ శాసనసభ్యులు సౌధాగర్ గంగారం , ఇంకా వీఐపీలు చాలా పెద్ద ఎత్తున భక్తులు వివిధ గ్రామాల నుంచి గురు స్వాములు ,స్వాములు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎంతో వైభవంగా ఎంతో కనుల పండుగగా సువర్ణ మందిరం గా మండపాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు గణపతి హోమం తో ప్రారంభమైన అయ్యప్ప మహా పడిపూజ రాత్రి  11:30 వరకు పూజా , భజన భక్తులు పులకించిపోయారు.. రాత్రి స్వామివారికి అలంకరణ కన్నుల పండుగ చేసినం ఆర్తి మంత్రపుష్పంతో కార్యక్రమం ముగించారు. పాదయాత్ర చేసిన స్వాములకు, రుషితుల్య స్వాములకు ఘనంగా సన్మానించారు . బాన్స్వాడ అయ్యప్ప స్వాములే కాకుండా, మద్నూర్, బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, రుద్రూర్, వర్ని, నర్సులాబాద్, పిట్లం, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాల ధారణం ధరించిన సాములు ఈ మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్ర గురుస్వామి వినయ్ గురుస్వామి, శంకర్ గురుస్వామి, భాస్కర్ గురుస్వామి, ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.

Ayyappa Maha Padipuja as Angaranga Vibhava