Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 6:53 pm Posted by : ramakrishna

ఘనంగా అయ్యప్ప ఆరట్టు 

  • అయ్యప్ప స్మరణతో చిందులు వేసిన స్వాములు 
  • పట్టణ పలు వీధుల్లో స్వామి ఊరేగింపు 

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలోని చొక్కయ్య గుట్ట పై కొలువైన హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆరట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భీమ్ గల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తిని, చిత్రపటాన్ని దివ్య అలంకృతమైన వాహనం పై ఉంచి ఘనంగా స్వామి వారి ప్రభాత భేరిని నిర్వహించారు. స్వామి ఆశీనులైన వాహనంను భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, మంగళహారతులు ముందు నడుస్తుండగా స్వామి వారి సంకీర్తన స్వామి దింతక తోమ్ అయ్యప్ప దింతక తోం అంటూచిందులు వేస్తూ పెట్టతుల్లాయి ఆట ఆడుతూ స్వామిని ఊరేగించారు. ఇందులో భాగంగా స్వామి వారిని శ్రీ అభయాంజనేయ స్వామి గుడి నుండీ బస్టాండ్ గుండా సుదర్శన్ ఢిలక్స్ వరకు అక్కడి నుండి శ్రీ నంధీశ్వరా ఆలయం గుండా అంగడి బజారు వరకు అక్కడి నుండి పాత పోలీస్ స్టేషన్ గుండా రజక వాడ నుండి మజీద్ మీదుగా సుమంగళి చౌరస్తా వరకు ఊరేగించారు. అక్కడి నుండి స్వామి ఆలయం వరకు ఊరేగింపును అయ్యప్ప మాలధారణ స్వాములు ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్బంగా స్వాములు పసుపు కుంకుమ, బకా గులాలు చాలుకుంటూ నృత్యాలు చేశారు. ఈ బృహత్తార ఆరాట్టు కార్యక్రమం లో అయ్యప్ప స్వాములు, భక్తులు,అయ్యప్ప సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Ayyappa Aartu