ఆర్గొండ లో ఆయుష్ శాఖ వృద్ధాప్య వైద్య శిబిరం
బతుకమ్మ, ఆర్గోండ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడం జరిగిందని వైద్యులు వెంకటేశ్వర్లు, చైతన్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో సాధారణ ఆరోగ్య తనిఖీ రక్తపోటు మధుమేహం మోకాళ్ల నొప్పులు ఇతర జబ్బులకు ప్రత్యేకంగా చికిత్స అందించడం జరిగిందని చికిత్స అందించిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపియంఓ...