Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 6:28 pm Posted by : ramakrishna

ఆర్గొండ లో  ఆయుష్ శాఖ  వృద్ధాప్య వైద్య శిబిరం 

బతుకమ్మ, ఆర్గోండ :  కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు  చికిత్స అందించడం జరిగిందని వైద్యులు వెంకటేశ్వర్లు, చైతన్య  తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో సాధారణ ఆరోగ్య తనిఖీ రక్తపోటు మధుమేహం మోకాళ్ల నొప్పులు ఇతర జబ్బులకు ప్రత్యేకంగా చికిత్స అందించడం జరిగిందని చికిత్స అందించిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు అందించామని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో  డిపియంఓ శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ లు పాల్గొన్నారు.

 ఆరోగ్య శిబిరంను సంధర్శించిన యువ నాయకులు..

ఆర్గోoడ గ్రామంలో గల ఆయుష్ సెంటర్ ను డాక్టర్ చైతన్య, డిపియంఓ శ్రీకాంత్  ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిభిరంను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి సందర్షించారు. సెంటర్ కి కావాల్సిన మౌలిఖ వసతులు, స్టాఫ్ కొరత గూర్చి తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి  సెంటర్ చుట్టూ ప్రక్కల గ్రామాలలో లేదని మారుతున్న కాలానుగుణంగా ఆయుష్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఇలాంటి సెంటర్ కి గవర్నమెంట్ ఇంకా మౌళిక సదుపాయాలు కల్పించి, ఉద్యోగులను   ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఆసరాగా ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోరువ చూపి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి ఆయుష్ ఆస్పత్రి సమస్యలను విన్నవించి త్వరలోనే అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి తెలిపారు.

AYUSH Department Geriatric Medical Camp in Argonda