నిజామాబాద్‌లో పీఎం రాహత్ స్కీమ్‌పై అవగాహన వర్క్ షాప్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న “పీఎం రాహత్ స్కీమ్” పై నిజామాబాద్‌లోని ఐఎంఏ మీటింగ్ హాల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మస్తాన్ అలీ, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల...