Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:18 pm Posted by : ramakrishna

నిజామాబాద్‌లో పీఎం రాహత్ స్కీమ్‌పై అవగాహన వర్క్‌ షాప్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న “పీఎం రాహత్ స్కీమ్” పై నిజామాబాద్‌లోని ఐఎంఏ మీటింగ్ హాల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన వర్క్‌ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మస్తాన్ అలీ, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల వరకు లేదా ఏడు రోజుల పాటు ఉచిత వైద్య చికిత్స అందించబడుతుందని తెలిపారు. జిల్లా పరిధిలోని 38 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఈ పథకం అమలులో సమన్వయంతో పనిచేసి, బాధితులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆసుపత్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్క్‌ షాప్‌లో శిక్షణ అందించిన ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్ మాట్లాడుతూ, త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఈ పథకం అమలులోకి రానుందని తెలిపారు. ఈ స్కీమ్ విజయవంతంగా అమలు కావాలంటే పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల సహకారంతోనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని వివరించారు. టెక్నికల్ పరమైన సహాయ సహకారాల కోసం ఎన్‌ఐసీ విభాగం ముందుండి పనిచేస్తుందని జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. విశాల్, జిల్లా కార్యదర్శి సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్ రెడ్డి, వివిధ ఆసుపత్రుల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Awareness workshop on PM Rahat Scheme in Nizamabad