మోపాల్, బతుకమ్మ : మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం మంచిప్ప గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించారు. కల్తీ కల్లు, రోడ్డు భద్రత నియామాలపై అవగాహన కల్పించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్ళరాదని సూచించారు. మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్100 కు కాల్ చేయాలని తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, మొబైల్ దొంగిలించ బడిన సందర్భంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయవచ్చని తెలిపారు. ఎమర్జెన్సీ సేవల కోసం డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం నేరమని, చట్టపరమైన శిక్షకు లోనవుతారని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుష్మిత, కళాబృందం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
