పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే అవగాహనా  కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని, పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి గొడవలు చేసుకోవద్దని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, డబ్బుకు, మద్యానికి లొంగ వద్దని తెలిపారు. మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో డయల్ 100 కాల్...