Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 6:20 pm Posted by : ramakrishna

జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ సంక్షేమ బాలికల హాస్టల్ లో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ మధు మంచి ఆదేశాల మేరకు నిర్వహించారు.ఈ సందర్బంగా  అడ్వకేట్ పద్మ పండరి, ఎస్ఐ మహేష్ లు మాట్లాడుతూ  ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం అత్యంత అవసరం. న్యాయ సేవ అధికారి ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించబడుతుంది. ప్రత్యేకంగా మహిళలు, విద్యార్థినీలు , సామాజికంగా వెనుకబడిన వర్గాలు తమ హక్కులను తెలుసుకొని న్యాయం పొందేందుకు ప్రతి ఒకరు ముందుకు రావాలని తెలిపారు. న్యాయ సేవ హక్కులు, సైబర్ క్రైమ్ అవగాహన, చట్టపరమైన రక్షణ చర్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో అడ్వకేట్ పద్మ పండరి, ఎస్ ఐ బీ. మహేష్,హాస్టల్ వార్డెన్ శారద, పి ఎల్ వి. లింగమయ్య ,ఇతర న్యాయ సేవా సంఘ సభ్యులు , విద్యార్థినిలు పాల్గొన్నారు.

Awareness to students on the occasion of National Legal Services Day