రైతులకు అవగాహన

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నూతనంగా రైతు నేస్తం కార్యక్రమం క్రింద వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ని మంజూరు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తెలిపారు. రైతులకు నేరుగా వ్యవసాయానికి సంబందించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించి వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3.00గంటలకు లాంచనంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం...