మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నూతనంగా రైతు నేస్తం కార్యక్రమం క్రింద వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ని మంజూరు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తెలిపారు. రైతులకు నేరుగా వ్యవసాయానికి సంబందించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించి వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3.00గంటలకు లాంచనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం రాజేంద్రనగర్ హైదరాబాద్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభోత్సవము చేయడం జరిగింది. ఇందులో భాగంగా నూతనంగా పాలెం , డొంకల్ రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించారు. అలాగే మోర్తాడ్ రైతువేదిక లో ఇంతకుముందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసిర్ శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీలత, లకపతి, రైతులు రాములు, మురళి, మహిపాల్, బుమన్నా, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.