Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 7:00 pm Posted by : ramakrishna

కీటక జనిత వ్యాధులపై విస్తృతంగా అవగాహన కలిగించాలి

 

. . . డీఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎఫెక్టివ్ మానీటరిoగ్ చేస్తూ అన్ని ఏరియాలలో ప్రజలకు కీటక జనిత వ్యాధులపై, సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కలిగించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కీటక జనీత వ్యాధుల నియంత్రణ విభాగంలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వంటి అన్ని రకాల వ్యాధులపై అవగాహన ఉండాలన్నారు. కీటక జనీత వ్యాధుల నియంత్రణ లో భాగంగా పనిచేసే సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు వారి వారి విధుల్లో నాణ్యమైన సేవలు అందిస్తూ యాక్టివ్, పాసివ్ ఆర్డిటిని పెంచాలన్నారు. అదేవిధంగా ఐహెచ్ఐపి మలేరియా పోర్టల్ లో నిరంతరం ఎంట్రీ చేయాలని అన్నారు. ఎం4 అబ్స్ట్రాక్ట్ రిపోర్టును ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని తెలియజేశారు. ఫ్రైడే డ్రై డేను పకడ్బందీగా నిర్వహిస్తూ ముందస్తు ప్రణాళికను, వారం వారం రిపోర్ట్స్ ను సమర్పించాలని తెలియజేశారు. అదేవిధంగా పాత ఫైలేరియా వ్యాధిగ్రస్తుల జాబితాను సవరిస్తూ చనిపోయిన వారిని డిలీట్ చేసి సవరించిన జాబితాను డిఎంఓ కి, డిఎంహెచ్ఓ కి సమర్పించాలని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ పాజిటివ్ వైరల్ హెపటైటిస్ బి యొక్క జాబితాను మీ మీ పీహెచ్ సీ పరిధిలో సవరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ వెంకటేష్, డాక్టర్స్ శ్రావ్యా, ఏఎంఓషేక్ సలీం, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

 

 

Awareness should be spread widely about insect-borne diseases.