ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ డెస్క్ పై అవగాహన కలిగించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : అనధికార లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దరఖాస్తు దారులు సద్వినియోగ పరుచుకునే విధంగా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటీ లో ఎల్.ఆర్.ఎస్. హెల్ప్ లైన్ డెస్క్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లే అవుట్లు, ప్లాట్ల రెగ్యులరైస్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. మార్చి 31 వరకు...