- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా గురువారం బిర్కూర్, నసురుల్లాబాద్ రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని, చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణీ స్థానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిhలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఇంతే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు. ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూ భారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుచున్నదని తెలిపారు. అంతకుముందు చట్టం పై రూపొందించిన వివరాలను ఆయా తహసీల్దార్లు వివరించారు. బిర్కూర్ గ్రామస్తుడు రవి మాట్లాడుతూ, తమ గ్రామంలో సర్వే నెంబర్ 228 లోని సమస్యను పరిష్కరించాలని కోరారు. సాయిబాబా మాట్లాడుతూ, పట్టాలు ఉండి భూమి లేదని, భూ భారతి ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులకు చట్టాల గురించి ఈ ప్రభుత్వం తెలియజేయడం హర్షణీయం అని కిషోర్ తెలిపారు. నసురుల్లబాద్ గ్రామ రైతు నగేష్ మాట్లాడుతూ ప్రజల వద్దకు అధికారులు రావడం ప్రజాపాలన ప్రభుత్వమని అన్నారు. రైతుల సమస్యలు భూ భారతి తో పరిష్కరించాలని తెలిపారు. గంగారం మాట్లాడుతూ ధరణీ వలన పరిష్కారం.కానీ సమస్యలు భూ భారతి చట్టం తో పరిష్కరించాలని కోరారు. నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి దయానంద్ మాట్లాడుతూ, రైతుకు భూమి యొక్క రికార్డు లు బాగుంటే రైతు ధైర్యంగా ఉంటాడని తెలిపారు. ధరణీ వలన ఎన్నో కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులోఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
